ఈ మధ్య నాకు నచ్చిన ప్రముఖ websites లో Digital Library of India వారి http://www.dli.ernet.in/ సైట్ ఒకటి. నచ్చటం అంటే అంతా ఇంతా కాదండోయ్, చెప్పనలవి కానంత నచ్చింది.
కారణం ఏమంటే ఈ సైట్ అపార గ్రంథనిధిని అందరికీ అందించడమే.
18వ శతాబ్ధి మొదలుకొని నేటి వరకు ప్రచురింపబడి వివిధ ప్రముఖ గ్రంథాలయాల్లో కొలువైయున్న పుస్తకాలను [అరుదైన గ్రంథరాజములను] ఈ website ద్వారా ఉచితంగా పొందవచ్చు, ఆన్ లైన్‌లో చదువ వచ్చు, ఉచితంగా Download చేసుకోవచ్చును.
కాకపోతే మనకు కావల్సినవాటిని Download చేసుకునేందుకు కొన్ని చిన్న చిన్న చిక్కుముడులను విప్పుకుని వెళ్ళాల్సివుంటుంది.
అదే https://archive.org/ సైట్ తో ఇలాంటి సమస్య వుండదు అక్కడ నేరుగా ఆన్‌లైన్‌లో చదివే అవకాశంతో పాటు, మనకు నచ్చిన formats లో download చేసుకొనెడి అవకాశం వుంది.
ఇక్కడ అంత సౌకర్యం లేదు.
మరేం చేయాలి?
అమ్మయ్యా! ఇప్పుడు ఈ క్రింది చూపిన చిత్రంలో మాదిరి మీకు ఏ పుస్తకాలు కావాలో అంటే
పుస్తకం పేరు, రచయిత పేరు, ఏ యే సంవత్సరాల మధ్య కాలం print అయిన గ్రంథము, ఏ విషయానికి చెందిన పుస్తకము (ఆథ్యాత్మికమా? సాహిత్యమా? తత్వశాస్త్రమా), ఏ భాష (తెలుగు, సంస్కృతం)
పైవాటిలో మీకు తెలిసినవి పూరించి search బటన్ ని క్లిక్ చేస్తే ...
ఇలా వస్తుంది
అప్పుడు మీకు కావల్సిన పుస్తకంతో పాటు దానికి చెందిన 13 అంకెల సంఖ్య బార్‌కోడ్ ను సైతం మనం గమనించవచ్చు.
అప్పుడు Click here అని వున్న చోట మౌస్ కర్సర్‌తో క్లిక్ చేసినట్లయితే న్యూటాబ్‌లో ఆ గ్రంథాన్ని ఆన్‌లైన్‌లో చదువ వచ్చు.
పేజీ దిగువ భాగంలో ఇచ్చిన మీటలు సాయంతో మనకు కావల్సిన పేజీలకు నేరుగా వెళ్ళవచ్చు
అలాకాక download చేసుకోవాలి అంటే మటుకూ ఓ చిన్న అప్లికేషన్‌ని download చేసుకోవాల్సి వస్తుంది. తద్వారా మనం కోరుకున్న పుస్తకాలను ఎన్నింటినైనా సరే PDF రూపంలో పొందవచ్చు.
ఆ అప్లికేషన్ Download చేసుకొన విధంబు ఎట్టిదనిన...
ఆ అప్లికేషన్ పేరు: DLI Downloader
లభ్యమగు చోటు: https://github.com/cancerian0684/dli-downloader/releases
ముఖ్యగమనిక: మీ కంప్యూటర్‌కు సరిపడే వెర్షన్‌ని డౌన్లోడ్ చేసికొన గలరు.
ఈ Application గురించి మరింత వివరంగా తెలుసుకునేందుకు ఇక్కడ click చేయగలరు.
డౌన్లోడ్ అయిన పిదప ఇట్లుండును
ఇప్పడు ఇద్దానిపై రెండు పర్యాయములు మౌస్ కర్సర్ సాయంతో ఒత్తిన యెడల మీ మీ కంప్యూటర్లలో చక్కగా INSTALL అగును.
అట్లు చక్కగా ఇన్‌స్టాల్ అయినందుకు సూచకంగా Task bar Notification Area లో ఈ క్రింది విధంబుగా ఒక Pop Up balloon దర్శనమిచ్చును.
ఆ బెలూన్ మెసేజ్ క్లిక్ చేసిన యెడల ఇటుల వచ్చును.
ఆ తరువాత NO మీటను నొక్కి, Type to Search అని పై భాగంలో వున్నచోట ఇందాక మనం ఎంచుకున్న పుస్తకం యొక్క BAR CODE ను PASTE చేసి Enter మీట నొత్తవలెను.
అప్పుడు ఇట్లు వచ్చును
అప్పుడు పై బొమ్మయందు చూపిన రీతిలో Mouse Right Button Click చేసి Download ను క్లిక్ చేయవలెను. పిదప పై భాగంలోని Downloads Tab లోనికి వెళ్ళినట్లయితే ఇట్లు కన్పించును.
100 % డౌన్లోడ్ అయిన పిదప
మరో POP UP BALLOON ప్రత్యక్షమై తాను (ఆ పుస్తకం) PDF format లో సిద్ధంగా వున్నట్లు సూచిస్తుంది.
లేదా ఆ డౌన్లోడ్ అయిన లొకేషన్ లో మనమే నేరుగా వెళ్ళి చూడవచ్చు
ఈ క్రింది విధంబుగా...
ఆ PDF ఫైలు తెరిచిన తొలి పుటలొ ఇట్లు ఆ పుస్తకానికి చెందిన వివరములు కన్పించును.
మలి పుటలలో మన కోరుకున్న content లోనికి వెళ్ళవచ్చును ఈ మాదిరి
ఈ DLI Downloader Application Window ఈ క్రింద చూపిన విధంగా వుండును.
...ఇక్కడ ఏదో Indexing Telugu అని download అవుతున్నది automatic గా మనం ఏవిధమైన సంజ్ఞ/అనుమతి ఇవ్వకుండానే,
దానిని cancel చేయాలంటే పై పటంలో చూపిన విధంగా రైట్ క్లిక్ చేసి stop task ని క్లిక్ చేసినట్లయితే... అది download అవ్వటం ఆగిపోతుంది.
కొన్ని అంశములు:
1. పుస్తకాలు అప్లోడ్ చేసిన వారు పుస్తకాల పేర్లను సరియైన రీతిలో వ్రాయని కారణం చేత మనం కోరే పుస్తకాలు నేరుగా దొరికే అవకాశం చాలా తక్కువ.
ఉదాహరణకు: పెద్దబాలశిక్షను PeddabalaSiksha లేదా Peddabaalashiksha అని మనం అనుకున్నాం అనుకోండి వాళ్ళు ఆ పుస్తకాన్ని "peddabaalashikshha 1" పేరుతో Upload చేశారు. ఒక్క 'h'అనే అక్షరం ఎక్కువగా వుండటం చేత మనం పై విధంగా వెతికితే వెయ్యిజన్మలెత్తినా కనిపించదు అంచేత మనం Trail & Error సూత్రానుగుణంగా వివిధ రీతుల యత్నింపవలెను.
2. ఓపిక, తీరిక, కోరిక బలీయంగా వున్నవాళ్ళు Search box లో కేవలం భాష, విషయం [Language, subject] మాత్రమే ఇచ్చి వెదకి నట్లయితే ఇప్పటి వరకు తెలుగుభాషలో అప్లోడ్ అయిన 23,000 పైచిలుకు పుస్తకాలు అక్షరక్రమంలో దర్శనమిస్తాయి.
ఇక ఒక్కొక్క పేరు చూసుకుంటూ మనకు కావల్సిన పుస్తకం కనపడగానే దాని barcode ను copy చేసి భద్రపరచుకోవాలి.
3. ఇంకా ఉదార స్వభావులు, సహృదయులు ఎవరైనా వున్నట్లయితే Google groups, Facebook, blogs వంటి మాధ్యమాల సాయంతో అరుదైన గ్రంథాలు వాటి బార్ కోడ్ వివరాలను విస్తృతంగా ప్రచారం చేయాలి.

నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు ఇక్కడ ఈ వివరాలు అందించడం జరిగినది. మరేదైనా సందేహాలుండిన, ఇన్‌స్టాలింగ్ లో సమస్యలు ఎదురైనా పట్టు విడువక గూగుల్ ద్వారా సమాధానపడగలరు.
ఇది పుస్తకప్రియులెల్లరకూ సహాయకారిణి కాగలదని ఆశిస్తూ
పుస్తకాల నెలవుకు జై కొడుతూ ఇక సెలవు.